సాగునీటి రంగం ప్రగతిలో దేశానికే తెలంగాణ స్ఫూర్తి
సాగు, తాగునీటి రంగం ప్రగతిలో తెలంగాణ దేశానికే స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు.
మాట్లాడుతున్న ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
కాజీపేట, న్యూస్‌టుడే: సాగు, తాగునీటి రంగం ప్రగతిలో తెలంగాణ దేశానికే స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం హనుమకొండలోని ఓ ప్రైవేటు వేడుకల మందిరంలో సాగునీటి దినోత్సవం నిర్వహించారు. ఆ శాఖ ఎస్‌ఈ సీతారాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణలో నీటిపారుదలశాకకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, అపరభగీరథుడిలా కృషి చేశారని, ఆ ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయని అన్నారు. సాగును రైతులు పండగలా చేసుకుంటున్నారని అన్నారు. మిషన్ కాకతీయతో అనేక చెరువులు బాగుపడ్డాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండటం సాగునీటి రంగంలో కృషి చేసిన విశ్రాంత చీఫ్ ఇంజినీరు కె.వీరయ్య, ఈఈ బి.భద్రయ్య, డీఈ నర్సయ్యలను ఈ సందర్భంగా సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కుడా ఛైర్మన్ సుందరరాజు యదవ్, మాజీ ఛైర్మన్ మర్రియాదవరెడ్డి, కార్పొరేటర్ మానస రాంప్రసాద్, డీఈ కిరణ్ పాల్గొన్నారు. తెలంగాణ కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
V Pasu: ‘చంద్రముఖి 2’.. రజనీకాంత్ రిజెక్ట్ చేశారా..?: పి.వాసు ఏమన్నారంటే
-
Nithin Kamath: డిజిటలైజేషన్కి ముందు ఖాతా కోసం 40 పేజీలు కొరియర్ చేసేవాళ్లు: జిరోదా సీఈఓ
-
Festival season: పండగ సీజన్.. ఆపై వరల్డ్ కప్.. కొనుగోళ్లే కొనుగోళ్లు!
-
Chandrababu Arrest: ‘మీ అందరి మద్దతు చూసి గర్వపడుతున్నా’: ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి
-
Chandra babu Arrest: ప్రజల ఫోన్లలో వాట్సాప్ డేటా తనిఖీ చేయడం దుర్మార్గమైన చర్య: లోకేశ్
-
Ravi Kishan : దానిశ్ అలీ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు.. చర్యలు తీసుకోండి : రవికిషన్