logo

బైరైటీస్‌ అక్రమ రవాణా అడ్డగింత

కోట్యానాయక్‌తండా పరిసర ప్రాంతాల నుంచి అక్రమంగా కోదాడ వైపు తరలిస్తున్న బైరైటీస్‌ ఖనిజ లారీని మండలంలోని పుల్లూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఎస్సై వెంకన్న ఆధ్వర్యంలో సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

Published : 10 Jun 2023 02:49 IST

గార్ల, న్యూస్‌టుడే: కోట్యానాయక్‌తండా పరిసర ప్రాంతాల నుంచి అక్రమంగా కోదాడ వైపు తరలిస్తున్న బైరైటీస్‌ ఖనిజ లారీని మండలంలోని పుల్లూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఎస్సై వెంకన్న ఆధ్వర్యంలో సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య మూడుసార్లు అక్రమంగా ఖనిజం తరలినట్లు ఆరోపణలున్నాయి. ఆ పరిసర ప్రాంతాల్లో అటవీ అధికారులు ట్రెంచ్‌ ఏర్పాటు చేసినప్పటికీ వీరు మరో దారి నుంచి అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. కొంత మంది వ్యక్తుల చరవాణి నుంచి వచ్చే సమాచారంతో లారీలను ఆ ప్రాంతానికి తరలిస్తున్నట్లు డ్రైవరు తెలిపారు. తాజాగా అక్రమ రవాణాకు తరలుతున్న లారీ కోదాడకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, గతంలో రెండుసార్లు ఓ ప్రజాప్రతినిధి ఖనిజాన్ని తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఖనిజ నిల్వల పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమంగా తరలుతున్న సుమారు రూ.80 వేలు విలువైన ఖనిజాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులైన జి.భీమ, డి.వెంకట గురువులు, డి.వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకొని వారిపై కేసును నమోదు చేసినట్లు ఎస్సై వెంకన్న వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని