logo

వినాయక ప్రకృతి ప్రేమిక..!

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న తరుణంలో రసాయనాలతో ఏర్పాటు చేసే విగ్రహాలతో జల, వాయు కాలుష్యమవుతోంది.

Updated : 18 Sep 2023 06:36 IST

నేటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

వినాయకుడు.. పార్వతి చేతిలో పిండితో చేయిబడ్డ రూపం. ఔషధ గుణాలున్న 21 పత్రులతో పూజలందుకునే ప్రకృతి ప్రేమికుడు. చివరకు గంగమ్మలో కలిసి జలాలను శుభ్రం చేసే పర్యావరణ పరిరక్షకుడు.

గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న తరుణంలో రసాయనాలతో ఏర్పాటు చేసే విగ్రహాలతో జల, వాయు కాలుష్యమవుతోంది. ఈ విషయాన్ని భక్తులందరూ గ్రహించారు.. పల్లెలు, పట్నాలలో మట్టి వినాయకులకే జై కొడుతున్నారు. చెరువుల్లోంచి బంక మట్టిని తెచ్చి ప్రతిమలు తయారు చేసి పూజలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇదే స్ఫూర్తిని కొనసాగించి పర్యావరణాన్ని కాపాడదాం.


మొక్కలు పెంచుదాం

ఈనాడు,మహబూబాబాద్‌: తొమ్మిది రోజుల పాటు పూజలందుకునే ఏకదంతుడు ఔషధ గుణాలు గల 21 పత్రులతో పూజలందుకుంటారు.    ఒకప్పుడు పత్రిలోని కొన్ని మొక్కలు ఇంటి పెరట్లో ఉండేవి. ఇప్పుడవి కానరావడం లేదు. ఇకపై ఖాళీ స్థలాల్లో నాటి సంరక్షించుకుందాం. అడవులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభు త్వం ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 1.66 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.  వాటి సంరక్షణ మనం  బాధ్యత అని మర వొద్దు.


ప్లాస్టిక్‌ను దూరం చేద్దాం

వినాయకుడి చేతిలో ఉండే పాశం విఘ్నాలు పారదోలే సాధనం. చవితి రోజున మన విఘ్నాలు తొలగించాలంటూ వేడుకుంటాం.   ప్రకృతి విధ్వంసానికి ప్రతీకగా  మారి న ప్లాస్టిక్‌ వాడకాన్ని పారదోలి  వస్త్ర, జూట్‌ సంచులను వాడదాం.    ఉమ్మ డి వరంగల్‌ జిల్లాలో తొమ్మిది పట్టణా లు, ఒక నగరం పరిధిలో ప్రతి రో జూ వెలువడుతున్న 392.5 లక్షల టన్నుల చెత్తలో  ప్లాస్టిక్‌దే సింహ భాగం.ఈ పండగ నుంచి పర్యా వవరణ పరిరక్షణకు పూనుకుందాం.


చిరుధాన్యాల ఆహారం

బాన పొట్ట కలిగిన లంబోదరుడు భోజనప్రియుడు. గణపయ్య తినేది ఆరోగ్యానికి దోహదపడే ఆహారం.  మనం  రోజు తినే ఆహారంలో జంక్‌ఫుడ్‌దే సింహభాగం. ఫలితంగా రోగాలు చుట్టుముడుతున్నాయి. ఈ నవరాత్రుల సందర్భంగా జంక్‌ ఫుడ్‌ను పక్కన పెట్టి.. ఆరోగ్యానికి దోహదపడే చిరుధాన్యాల ఆహారం తీసుకుంటామని నిర్ణయం తీసుకోండి. హనుమకొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లో చిరుధాన్యాలతో అల్పాహారం తయారు చేసి విక్రయించే కేంద్రాలున్నాయి.  వ పెద్దవంగర మండలం వడ్డేకొత్తపల్లికి చెందిన మహిళా సంఘాల సభ్యులు చిరుధాన్యాలతో పిండి వంటలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో చిరుధాన్యాలు సాగు చేసే వారున్నారు.


ప్రతినబూనుదాం

వినాయకుడి తొండం ఓంకారానికి సంకేతం. ఇది ఓంకార ప్రణవ నాదానికి ప్రతీక. అందరిలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడానికి దోహదపడుతుంది. మనం కూడా ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతామని, వాతావరణానికి హాని కలిగించే వాటిని దూరం చేస్తామనే భావనను మనస్సులో పెంపొందించుకోవడంతో పాటు ఆచరణలో అమలు చేద్దామని ప్రతినబూనుదాం.


సేంద్రియ సాగు చేద్దాం

పూర్ణ కుంభం లాంటి  మహత్తరమైన ఆకారం కలిగిన విగ్రహాలను బంక మట్టితో తయారు చేస్తున్నారు. వాటిని పూజిస్తున్నారు. ఇది మంచికి శుభసూచకం. అలాగే రైతులు సేంద్రియ సాగు వైపు అడుగులు వేయాలి.ఈ పద్ధతులు ఆచరిస్తే నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడిన వారమవుతాం. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం ఏనెబావి గ్రామంలోని 50 కుటుంబాలను  స్ఫూర్తిగా తీసుకొని అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు