logo

భూకబ్జాదారు పోలీసు నుంచి కాపాడండి

భూకబ్జాదారుడైన పోలీసు అధికారి వేధింపుల నుంచి కాపాడి తమ ప్లాట్లను తమకు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ పలువురు బాధితులు గొర్రెకుంటలోని ప్లాట్ల వద్ద ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు.

Published : 21 Sep 2023 03:00 IST

ప్లాట్ల వద్ద ప్లకార్డులతో ఆందోళన చేస్తున్న బాధితులు

కీర్తినగర్‌కాలనీ(గీసుకొండ), న్యూస్‌టుడే: భూకబ్జాదారుడైన పోలీసు అధికారి వేధింపుల నుంచి కాపాడి తమ ప్లాట్లను తమకు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ పలువురు బాధితులు గొర్రెకుంటలోని ప్లాట్ల వద్ద ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు వరంగల్‌కు చెందిన దేవునూరి రాజు, జి. రాజ్‌కుమార్‌, కౌసర్‌ సుల్తానా, ఆసియా, సదానందం తదితరులు మాట్లాడుతూ.. గొర్రెకుంట గ్రామంలో బందెల రాంచందర్‌ తన 2.10 ఎకరాల భూమిని 1992లో వెంచర్‌ చేశాడు. 36 ప్లాట్లు చేయగా తాము కొనుగోలు చేశాము. రాంచందర్‌ మృతిచెందడంతో అతని కుమారుడు హైదరాబాద్‌లో ఇంటలిజెన్స్‌ విభాగంలో ఎస్సైగా పని చేస్తున్న ప్రశాంత్‌కుమార్‌ తన తండ్రి అమ్మిన భూమి హద్దులను చెరిపేసి తప్పుడు పత్రాలు సృష్టించి కొంత భూమిని బంధువులకు అమ్మి మిగిలిన స్థలాన్ని మొగిలిచెర్ల ఫ్యాక్స్‌లో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. విషయాన్ని ప్రశాంత్‌కుమార్‌ను పలుసార్లు అడగగా మీ ప్లాట్లు మీకు ఇస్తామంటూ మభ్యపెడుతున్నాడు తప్పితే ప్లాట్లు ఇవ్వడం లేదని వాపోయారు. వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీ కరుణాకర్‌కు ఫిర్యాదు చేయగా స్థానిక పోలీసులు వచ్చి విచారణ చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు దీనిపై సమగ్రంగా విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని