logo

సింగరేణి ఉద్యోగులకు బకాయిల చెల్లింపు

సింగరేణి ఉద్యోగులకు 11వ వేతన ఒప్పందం బకాయిలు(ఏరియర్స్‌) గురువారం చెల్లించినట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

Published : 22 Sep 2023 05:15 IST

చెక్కు అందజేస్తున్న జీఎం శ్రీనివాసరావు

కోల్‌బెల్ట్‌, న్యూస్‌టుడే : సింగరేణి ఉద్యోగులకు 11వ వేతన ఒప్పందం బకాయిలు(ఏరియర్స్‌) గురువారం చెల్లించినట్లు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌ సింగరేణి భవన్‌ నుంచి డైరెక్టర్‌(ఫైనాన్స్‌) బలరాం నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. కొంత మంది కార్మికులకు చెక్కులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. 23 నెలల వేతనంలోని బకాయిలను ఒకే సారి ఇచ్చామని, సగటున ఒక్కో కార్మికుడికి రూ.3.70 లక్షల వరకు వచ్చాయని, అత్యధికంగా రామగుండం ఏరియా హెడ్‌ ఓవర్‌మెన్‌ రూ.9.91 లక్షలు పొందారని వెల్లడించారు. కంపెనీ వ్యాప్తంగా మొత్తం రూ.1450 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. 39 వేల మంది కార్మికుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. ఏరియర్స్‌ పొందిన ఉద్యోగులు సొమ్మును పొదుపుగా వాడుకోవాలని సూచించారు. భూపాలపల్లి ఏరియాలోని జీఎం కార్యాలయంలో జీఎం శ్రీనివాసరావు ఏరియర్స్‌ చెల్లింపు చెక్కులను గురువారం పంపిణీ చేశారు. కేటీకే 5వ గనికి చెందిన కార్మికులు ప్రభాకర్‌, గణపతిరెడ్డి, రవీందర్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎస్వోటూజీఎం వెంకటయ్య, అధికారులు తుకారాం, క్రాంతికుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని