logo

భద్రకాళి తీరంలో పడవ ప్రయాణం

సముద్ర తీరాలు, సరస్సుల వద్ద పర్యాటకులు పడవలో ప్రయాణించాలని మురిసిపోతుంటారు.

Updated : 22 Sep 2023 06:00 IST

వరంగల్‌ సాంస్కృతికం న్యూస్‌టుడే: సముద్ర తీరాలు, సరస్సుల వద్ద పర్యాటకులు పడవలో ప్రయాణించాలని మురిసిపోతుంటారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రామప్ప, పాకాల, లక్నవరం సరస్సుల్లో పర్యాటక శాఖ బోటులో ప్రయాణించే సౌకర్యం కల్పించింది. ఓరుగల్లు నగరంలో తొలిసారిగా పడవ సేవలు అందుబాటులోకి రానున్నాయి. భద్రకాళి సరస్సులో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బోటు సేవలు అందుబాటులోకి తేనున్నారు. 30 మంది ప్రయాణించేందుకు బోటు సిద్ధం చేశారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని