logo

హస్తినలో హస్తం రాజకీయం!!

అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం గెలుపు గుర్రాలకే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది.

Updated : 24 Sep 2023 05:03 IST

రంగంపేట, న్యూస్‌టుడే: అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం గెలుపు గుర్రాలకే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల వారీగా టీపీసీసీ పంపించిన మూడేసి అభ్యర్థుల వడపోత దాదాపుగా పూర్తయింది. దిల్లీలో స్క్రీనింగ్‌ కమిటీ ఛైర్మన్‌ మురళీధరన్‌ సమక్షంలో అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారని తెలిసింది.  ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదం తెలపగానే అక్టోబరులో తొలి జాబితా ప్రకటిస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లా నుంచి ఎనిమిది మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి. రెండు రోజుల పాటు స్క్రీనింగ్‌ కమిటీ సమావేశాలు జరుగుతాయని తెలిసి ముందుగానే ఆశావహులు హస్తినకు చేరుకున్నారు. వర్ధన్నపేట, మహబూబాబాద్‌, డోర్నకల్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌, వరంగల్‌ పశ్చిమలో ఎమ్మెల్యే టికెట్ల కోసం దరఖాస్తు చేసిన వారు ఏఐసీసీ ముఖ్య నాయకులను కలిసినట్లుగా తెలిసింది.
25 పేర్లు పరిశీలన: వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోని 12 శాసనసభ నియోజకవర్గాల నుంచి టికెట్ల కోసం 104 మంది దరఖాస్తు చేసుకున్నారు. టీపీసీసీ, ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ అభ్యర్థులను వడపోసి, 25 మంది పేర్లతో జాబితా రూపొందించింది. ములుగు నుంచి సీతక్క, భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణ, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి పేర్లు దాదాపుగా ఖరారైనట్లే.


స్క్రీనింగ్‌  కమిటీ  ముందుకొచ్చిన పేర్లు

భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణ
నర్సంపేట: దొంతి  మాధవరెడ్డి
డోర్నకల్‌: డాక్టర్‌ రామచంద్రునాయక్‌, నెహ్రూ   నాయక్‌
ములుగు: ఎమ్మెల్యే సీతక్క
జనగామ: కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పొన్నాల  లక్ష్మయ్య
స్టేషన్‌ ఘన్‌పూర్‌: ఇందిర, సాంబయ్య
వరంగల్‌ పశ్చిమ: నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా  రాఘవరెడ్డి
వరంగల్‌ తూర్పు: కొండా సురేఖ,    ఎర్రబెల్లి స్వర్ణ, డాక్టర్‌ కత్తి వెంకటస్వామి
వర్ధన్నపేట:కేఆర్‌.నాగరాజు, నమిండ్ల  శ్రీనివాస్‌, రాజయ్య
పరకాల:  ఇనగాల   వెంకట్రామిరెడ్డి, కొండా మురళి
పాలకుర్తి: ఝాన్సీరెడ్డి, తిరుపతిరెడ్డి, సుధాకర్‌
మహబూబాబాద్‌: ఉమా మురళీ నాయక్‌, బలరాంనాయక్‌, బెల్లయ్యనాయక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని