logo

ఆపదలో ఆదుకునే అభయ్‌ యాప్‌

మహిళలు, యువతులు, విద్యార్థినులకు ఆపద సమయంలో భద్రతే లక్ష్యంగా పోలీస్‌ ఆధ్వర్యంలో ఆవిష్కరించిన అభయ్‌ యాప్‌ను ప్రారంభించామని జిల్లా ఎస్పీ జి.చంద్రమోహన్‌ పేర్కొన్నారు.

Published : 24 Sep 2023 04:49 IST

అభయ్‌ యాప్‌ను ఆవిష్కరిస్తున్న ఎస్పీ చంద్రమోహన్‌

బయ్యారం, న్యూస్‌టుడే: మహిళలు, యువతులు, విద్యార్థినులకు ఆపద సమయంలో భద్రతే లక్ష్యంగా పోలీస్‌ ఆధ్వర్యంలో ఆవిష్కరించిన అభయ్‌ యాప్‌ను ప్రారంభించామని జిల్లా ఎస్పీ జి.చంద్రమోహన్‌ పేర్కొన్నారు. స్థానిక కోదండ రామచంద్ర స్వామి కల్యాణ మండపంలో అభయ్‌ యాప్‌ను శనివారం ఎస్పీ ఆవిష్కరించారు. సుమారు వెయ్యిమంది మహిళలతో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంతోపాటు వివిధ మండలాల పరిధిలో మహిళా ఉద్యోగులు, విద్యార్థినులు, గృహిణులు అధిక సంఖ్యలో రద్దీ ప్రాంతాల్లో వివిధ అవసరాల కోసం నిత్యం ప్రయాణాలు కొనసాగిస్తున్నారని, వారు ప్రయాణించే వాహనాలపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఏర్పాటుచేయడంతో పాటు వారికి రక్షణ కల్పించేందుకు జిల్లా పోలీస్‌ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. జిల్లాలోని సుమారు 200 ఆటోలకు క్యూఆర్‌ కోడ్‌, యూనిక్‌ నెంబర్లు రూపొందించామన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు ప్రయత్నించే డ్రైవర్ల ఆటకట్టిస్తామని అన్నారు. అభయ్‌ యాప్‌ను మహిళలు, యువతులు, విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ చెన్నయ్య, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ బాబురావు, ఎస్సై ఉపేందర్‌, వెంకన్న, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని