logo

అర్ధరాత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క ధర్నా

అభ్యర్థుల బ్యాలెట్‌ పత్రంలో తన ఫొటో చిన్నదిగా ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి దనసరి అనసూయ (సీతక్క) అర్ధరాత్రి ఒకటి తర్వాత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ముందు బైఠాయించారు.

Updated : 21 Nov 2023 06:12 IST
బ్యాలెట్‌ పత్రంపై తన ఫొటో చిన్నగా ఉందని ఆగ్రహం
ములుగు, న్యూస్‌టుడే:  అభ్యర్థుల బ్యాలెట్‌ పత్రంలో తన ఫొటో చిన్నదిగా ఉందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ అభ్యర్థి దనసరి అనసూయ (సీతక్క) అర్ధరాత్రి ఒకటి తర్వాత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ముందు బైఠాయించారు. అంతకు ముందు ఈ విషయంలో అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు..  ములుగు ఎస్సై వెంకటేశ్వర్‌ అక్కడికి చేరుకొని వారిని సముదాయించినప్పటికీ.. స్పష్టమైన హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామన్నారు. రిటర్నింగ్‌ అధికారి సూచన మేరకు నాయకులు సీతక్క మరో ఫొటోను తీసుకొచ్చి ఇచ్చారు. ఈ ఫొటోను ఈవీఎం బ్యాలెట్‌పై పొందు పరుస్తామని సమాధానమిచ్చి రిటర్నింగ్‌ అధికారి అంకిత్‌ వెళ్లిపోయారు. అయితే హామీలో స్పష్టత కనిపించడం లేదని కాంగ్రెస్‌ నాయకులు అక్కడే బైఠాయించారు. మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలంలో ప్రచారం నిర్వహించిన సీతక్క అర్ధరాత్రి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి విజయ్‌భాస్కర్‌తో మాట్లాడారు. అక్కడే బైఠాయించారు. ఇది అధికార పార్టీ కుట్రగా ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ విషయంపై సీతక్కను ఆరా తీశారు. అర్ధరాత్రి  1.30  తర్వాత కూడా సీతక్క ఆందోళన కొనసాగించారు.  కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌, నాయకులు బానోతు రవిచందర్‌, రవళిరెడ్డి, గొల్లపెల్లి రాజేందర్‌, రమేష్‌, తదితరులు పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని