logo
Updated : 06 Aug 2021 12:28 IST

Electricity Bill: అమ్మో.. కరెంటు బిల్లు రూ.6.74 లక్షలా?

జీలుగుమిల్లి, న్యూస్‌టుడే: అతను వడ్రంగి. ఇంటి వద్దే పని చేస్తుంటారు. కరోనా కష్టకాలంలో పనులు లేక కొట్టుమిట్టాడుతున్న అతనికి ఈనెల వచ్చిన కరెంటు బిల్లు భయాందోళనకు గురిచేసింది. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలేనికి చెందిన కానూరి లింగాచారికి నెల నెలా రూ.1500 నుంచి రూ.2100 వరకు బిల్లు వస్తుంది. కాగా జులై నెలాఖరున సిబ్బంది రీడింగ్‌ తీయగా ఏకంగా రూ.6,74,900 వచ్చింది. లింగాచారి కంగుతిని విద్యుత్తు అధికారుల వద్దకు పరుగులు తీశారు. దీనిపై ఏఈ శ్రీనివాస్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా మీటరులోని తప్పిదం వల్లే జరిగిందని, వెంటనే మార్చి పరిష్కరిస్తామన్నారు.

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని