logo
Updated : 10 Aug 2021 07:43 IST

అదృశ్యం కాదు హతమార్చారు.. అత్యాచారం కేసు విచారణలో వెలుగులోకి..

తాడేపల్లి, న్యూస్‌టుడే: అత్యాచారం కేసులో పట్టుబడ్డ నిందితుడిని విచారిస్తుండగా, అదృశ్యమైన చిరు వ్యాపారిని హత్య చేసినట్లు బయటపడడంతో పోలీసులు అవాక్కయ్యారు. కనిపించకుండా పోయిన ఇంటి యజమాని ఎప్పటికైనా వస్తాడని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు అతను హత్యకు గురయ్యాడన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్న వైనమిది. పోలీసులు తెలిపిన మేరకు... చింతలపూడి వాసి ఆనందకుమార్‌(28) విజయవాడలోని సింగ్‌ నగర్‌లో ఉంటూ, రైళ్లలో బఠానీలు, వేరుసెనగ విక్రయిస్తుంటారు. ఆయన భార్యాపిల్లలు చింతలపూడిలో ఉంటారు. వచ్చిన డబ్బును తీసుకొని ప్రతి శుక్ర లేదా శనివారం చింతలపూడి వెళుతుంటారు. ఎప్పటిలా జూన్‌ 19న ఆనందకుమార్‌ వేరుసెనగలు అమ్మి రైలులో బయలుదేరుతూ భార్య మృదులకు కొన్ని గంటల్లో చింతలపూడి వస్తానని ఫోన్‌ చేశారు. రెండు రోజులైనా అతడు ఇంటికి రాకపోవడంతో ఆమె అదే నెల 22న తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా పోలీసులు ఇటీవల తాడేపల్లిలోని సీతానగరం ఘాట్‌ వద్ద అత్యాచారానికి గురైన యువతి కేసుకు సంబంధించి షేర్‌ కృష్ణా అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని విచారిస్తుండగా ఒక వ్యక్తిని హత్య చేసినట్లు బయటపడింది. జూన్‌ 19న ఆనందకుమార్‌ ఎక్కిన రైలు కృష్ణా నది వంతెనపై నిలిచింది. అతడు రైలు దిగి కాలినడకన వంతెన మీదుగా వెళ్తుండగా పట్టాలకు ఉండే రాగి తీగలను అపహరించే తాడేపల్లికి చెందిన షేర్‌ కృష్ణ, ప్రసన్నకుమార్‌రెడ్డిలు కంటపడ్డాడు. తాము చేసిన దొంగతనం బయటపడుతుందనే భయంతో వారిద్దరూ కలిసి రాగి తీగను ఆనందకుమార్‌ మెడకు చుట్టి చంపేశారు. మృతదేహం కాళ్లు చేతులను ఇనుప గడ్డర్‌కు కట్టి కృష్ణా నదిలో విసిరేశారు. అనంతరం తాపీగా వంతెనపై నడుచుకుంటూ వస్తుండగా కింద నదిలో నీరులేని ప్రదేశంలో ఇసుకపై ఓ జంట కంటపడింది. ఇద్దరూ అక్కడికి చేరుకొని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

హత్య కేసుగా మార్ఫు. జూన్‌ 22న నమోదైన ఆనందకుమార్‌ అదృశ్యం ఘటనను పోలీసులు హత్య కేసుగా మార్చారు. నిందితుడి నుంచి హతుడి చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం లభ్యమైతే తప్ప కేసు కొలిక్కి వచ్చే అవకాశం లేదని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగి 50 రోజులవడం, రెండుసార్లు కృష్ణా నదికి వరదలు రావడంతో రైల్వే వంతెన నుంచి దిగువ వారధి మధ్యలో ఎక్కడైనా మృతదేహం ముళ్లకంపలకు చిక్కుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

జీవనాధారం కోల్పోయి: రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబం ఆనందకుమార్‌ది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి మందులు తెస్తూ, తనతో పాటు పిల్లల యోగక్షేమాలను 19న ఫోన్‌లో భర్త అడిగారని అతడి భార్య మృదుల సోమవారం విలేకరులతో చరవాణి ద్వారా విలపిస్తూ తెలిపారు.

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని