AP News: వర్షాలకు బయటపడ్డ కొవిడ్ బాధితుడి మృతదేహం
ఖననం చేస్తున్న సిబ్బంది
జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం పట్టణంలో రాజారాణి కల్యాణ మండపం సమీపంలోని శ్మశాన వాటికలో ఖననం చేసిన మృతదేహం ఒకటి వర్షాలకు బయటపడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. ఐదు నెలల కిందట కరోనాతో మృతి చెందిన వ్యక్తిని కుటుంబ సభ్యులు ఈ శ్మశాన వాటికలో ఖననం చేశారు. వర్షాల కారణంగా మట్టి కొట్టుకుపోయి మృతదేహం బయటపడింది. దీనిని గుర్తించిన పోలీసులు పురపాలక అధికారులకు సమాచారం అందించారు. శనివారం ఆ మృతదేహాన్ని తిరిగి ఖననం చేయించామని పులపాలక కమిషనర్ శ్రావణ్‌కుమార్ తెలిపారు. కొవిడ్ బాధితుల మృతదేహాలను నిబంధనల మేరకు పూడ్చకపోవడం వల్లే ఇలా బయటపడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటివి ఇంకెన్ని బయట పడతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.