logo
Published : 29/11/2021 02:18 IST

కమ్ముకున్న మేఘాలు

ఖరీఫ్‌ మాసూళ్లకు ఆటంకం

పాందువ్వలో పంట రక్షణ పనుల్లో కూలీలు

ఉండి, ఆకివీడు, న్యూస్‌టుడే: జిల్లాలో అన్ని మండలాల్లో వ్యవసాయ పనులు ఊపందుకున్న దశలో అల్పపీడన ప్రభావంతో కమ్ముకున్న మేఘాలు రైతన్నకు కన్నీళ్లు రప్పిస్తున్నాయి. కోతలు కోసి చేలపై ఉంచిన వరి పనలను ఒడ్డుకు చేర్చేందుకు అన్నదాతలు ఆదివారం ఉదయం నుంచి ఉరుకులు.. పరుగులు పెడుతునే ఉన్నారు. వివిధ మండలాల్లో మధ్యాహ్నం నుంచి చలి గాలులతో వర్షం కురుస్తోంది.

పడిపోయిన చోట్ల తగ్గుతున్న దిగుబడులు

జిల్లాలో 5.42 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గత నెల రోజుల నుంచి వరుస వర్షాలు, ఈదురుగాలులతో సుమారు 80 వేల ఎకరాల్లో వరి చేలు నేలకొరిగాయని అంచనా. ఉండి, భీమవరం, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, తణుకు, ఉంగుటూరు, దెందులూరు, తాడేపల్లిగూడెం తదితర నియోజకవర్గాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో చేలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల గింజ కోయకుండా మొలకలొచ్చింది. వాతావరణం అనుకూలించి పంట సవ్యంగా గట్టెక్కినచోట్ల ఎకరానికి సగటున 36 బస్తాల చొప్పున దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. వర్షాలకు దెబ్బతిన్న చోట్ల 20-25 బస్తాలు కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజుల కిందటి వరకూ వర్షాలు జిల్లాలో పంటలపై ప్రభావం చూపాయి. ఆ తర్వాత పొడి వాతావరణంతో పంట మాసూళ్లు ప్రారంభమయ్యాయి. బురదలో సైతం యంత్రాల సహాయంతో నేలకొరిగిన పంటను కోసి ఒడ్డుకు చేరుస్తున్నారు. వాటిలో రంగుమారిన ధాన్యం టన్నుల కొలదీ కనిపిస్తోంది. జిల్లాలో ఆదివారం సాయంత్రానికి 75 వేల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. సుమారు 1.70 లక్షల టన్నుల ధాన్యం ఒడ్డుకు చేరింది. వీటిలో 9 వేల టన్నులకు మించిన ధాన్యాన్ని రైతులు ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించుకున్నారు. మిగిలిన పంటను ఆరబెట్టేందుకు వాతావరణం అనుకూలించడంలేదని సాగుదారులు వాపోతున్నారు. ఈ దశలో మరోసారి వర్షాలు కురిస్తే... పంటపై ఆశలు పూర్తిగా వదులుకోవాల్సిందేనని అన్నదాతలు వాపోతున్నారు.

రొయ్యల సాగుదీ అదేదారి...

వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు చెరువుల్లో అత్యవసరంగా రొయ్యలను పట్టుబడులు పట్టేస్తున్నారు. రొయ్యల సాగు చెరువుల్లో నిరంతరం పంకాలు తిప్పుతూ ప్రాణవాయువు అభివృద్ధి చర్యలు తీసుకుంటూ రసాయనాలు చల్లుతున్నారు. చెరువుల వద్ద రైతులు కాపలా ఉంటున్నారు.

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని