logo
Published : 29/11/2021 02:18 IST

అంతా మొక్కుబడి తంతే!

ఐటీడీఏలో పథకాల అమలుపై కొరవడిన సమీక్షలు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే

కేఆర్‌పురం: పిచ్చిమొక్కలతో అసంపూర్తిగా ఉన్న క్రీడా వికాసకేంద్రం

మన్యంలోని గిరిజనుల అభ్యున్నతి, జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఏర్పాటుచేసిన కోటరామచంద్రాపురం ఐటీడీఏలో కార్యకలాపాలు మొక్కుబడి తంతుగా సాగుతున్నాయి. దాదాపు ఐదేళ్లుగా పాలకవర్గం సమావేశాలు నిర్వహించకపోవడంతో ప్రభుత్వ పథకాల ప్రగతి కుంటుపడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.2016 ఏప్రిల్‌లో ఐటీడీఏ పాలకవర్గ చివరి సమావేశం జరిగింది. దీర్ఘకాలికంగా పలు కీలక ఉద్యోగాలు ఖాళీగా ఉండటంతో ఇన్‌ఛార్జులతో నడిపిస్తున్నారు. ఉప వైద్య, ఆరోగ్యశాఖాధికారి పోస్టు ఏడేళ్ల నుంచి, పరిపాలనాధికారి, ఉప విద్యా శాఖాధికారుల కొలువులు ఐదేళ్లుగా, ప్రాజెక్టు వ్యవసాయాధికారి, ఉప గణాంకాధికారి పోస్టులు నాలుగేళ్లుగా, మేనేజర్‌ కొలువు మూడేళ్లుగా ఖాళీగా ఉన్నాయి.

రాకపోకలకు అవస్థలు..

మారుమూల రేగులపాడు, రేపల్లి, చింతకొండ, గొట్టాలరేవు, రెడ్డిబొడ్డేరు, ఉర్రింక, వీరన్నపాలెం, తంగేడుకొండ, గెడ్డపల్లి, గిన్నేపల్లి తదితర గ్రామాల రహదారుల అధ్వానంగా ఉన్నాయి. తానిగూడెం, మోదెల తదితర గ్రామాలకు రహదారి సదుపాయం లేదు. అత్యవసర వైద్యానికి ఆసుపత్రులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రేపల్లి రహదారి దుస్థితి

నత్తనడకన నిర్మాణాలు..

మన్యంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. 68 గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం ఏడాది కిందట ప్రారంభిస్తే.. ఇప్పటికి పులిరాముడుగూడెం, కోటనాగవరం, దర్భగూడెం, పోలవరం-1 మాత్రమే పూర్తి అయ్యాయి. 68 రైతు భరోసా కేంద్రాల భవనాలకు నాలుగు మాత్రమే పూర్తికాగా.. ఐదు వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లకు ఒక్కటీ పూర్తి కాలేదు. కేఆర్‌పురంలో రూ.కోటి అంచనాతో చేపట్టిన మినీ ఆడిటోరియం నిర్మాణం నాలుగేళ్లుగా సాగుతోంది. స్పోర్ట్స్‌ అథారిటీ నిధులు రూ.కోటి అంచనాతో చేపట్టిన క్రీడా వికాస కేంద్రం నిర్మాణం రెండేళ్ల కిందట నిలిచిపోయింది. గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కార్యక్రమాలు సాగడం లేదు.

వర్షాలకు మరింత అధ్వానం..

‘రహదారుల దుస్థితిపై ఐటీడీఏ అధికారులకు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. రాకపోకలకు అవస్థలు పడుతున్నాం. ఇటీవల వర్షాలకు రోడ్లు మరింత దెబ్బతిన్నాయి’ అని అలివేరు సర్పంచి కారం లక్ష్మి తెలిపారు.

నిర్మాణ పనుల పూర్తికి కృషి

‘అభివృద్ధి పనులను పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నాం. మినీ ఆడిటోరియం పూర్తి చేసి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాం’ అని గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ విభాగం ఈఈ రాజు తెలిపారు.

మన్యంలోని మండలాలు బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు

పంచాయతీలు: 79

జనాభా: 1,95,164 మంది

గ్రామాలు: 428

గిరిజనులు: 97,029 మంది

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని