logo
Published : 29/11/2021 02:18 IST

స్థల పరిశీలనతో సరి

కార్యరూపం దాల్చని శుద్ధి కేంద్రాల ఏర్పాటు

కొవ్వూరు: నిరుపయోగంగా మారిన చెత్త నిర్వహణ కేంద్రం

కొవ్వూరు పట్టణం, పాలకొల్లు, న్యూస్‌టుడే: చెత్త రహిత పురపాలికలను తీర్చిదిద్దాలన్న పాలకుల లక్ష్యం నెరవేరడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన స్వచ్ఛ యజ్ఞం పూర్తవకపోగా శుద్ధి ప్రణాళిక మరుగున పడింది. పురాల్లో మల వ్యర్థాలు, కలుషిత నీటి శుద్ధి నిర్వహణ కేంద్రాల ఏర్పాటు కలగా మిగిలింది.

జిల్లాలోని కొవ్వూరు, నరసాపురం, పాలకొల్లు పట్టణాలు నాలుగేళ్ల కిందట స్వచ్ఛ పురాలుగా ఎంపికయ్యాయి. స్వచ్ఛాంధ్ర సంస్థ ‘స్వచ్ఛ సంపూర్ణ సంకల్ప్‌’ పేరిట క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసింది. లక్ష్యం నెరవేరాలంటే ఏం చేయాలనేది ప్రభుత్వానికి నివేదించింది. ఒక్క నరసాపురంలోనే ఈ ప్రక్రియ ఆశాజనకంగా నడుస్తుండగా కొవ్వూరు, పాలకొల్లులో ఆ దిశగా అడుగు పడటం లేదు. థర్మల్‌ మల, వ్యర్థ శుద్ధి కేంద్రాల (ఫీకల్‌ స్లెడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ - ఎఫ్‌ఎస్‌టీపీ) ఏర్పాటు ప్రక్రియ పట్టాలెక్కలేదు.

కదలని వ్యర్థ ప్రక్షాళన.. పట్టణాల్లో వ్యర్థ ప్రక్షాళన చేయాలన్న కసరత్తు ఆదిలోనే నిలిచిపోయింది. కొవ్వూరులో 90 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన కేంద్రం అవసరమని, రూ.కోటి అవసరమవుతాయని అంచనా వేశారు. ఒకటో వార్డు పరిధిలో రెండుచోట్ల స్థలాలను పరిశీలించారు. గతేడాది రైల్వే బైపాస్‌ పక్కన 25 సెంట్ల స్థలాన్ని గుర్తించినా ప్రయోజనం దక్కలేదు.

చెత్తశుద్ధి కరవై.. కంపోస్టు యార్డు లేమి పట్టణాభివృద్ధిని వెక్కిరిస్తోంది. కొవ్వూరు రాజీవ్‌కాలనీలో తడి, పొడి చెత్త నిర్వహణ పనులు మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. సీవింగ్‌ యంత్రం ద్వారా చెత్తను జల్లెడ వేసి పొడి చెత్తను బయటకు తీసే ప్రక్రియ కొన్ని రోజులే సాగింది. లిటరరీ క్లబ్‌ సహకారంతో ఏర్పాటైన షెడ్డు నిరుపయోగంగా మారింది.

త్వరలో పనులు.. ‘కేంద్రం ఏర్పాటుకు స్థలం కేటాయించాం. నిధులు ఉన్నాయి. నిర్వహణ చేపట్టే సంస్థ మారడంతో జాప్యం జరిగింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి’ అని పాలకొల్లు పురపాలక సంఘ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ తెలిపారు.●

పాలకొల్లులో 75 వేల లీటర్ల సామర్థ్యంతో రూ.1.50 కోట్ల వ్యయంతో శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పెదగరువు ప్రాంతంలో రెండెకరాల స్థలాన్ని చూశారు. ఆ తరువాత వీటి గురించి పట్టించుకోలేదు.

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని