logo
Published : 29/11/2021 02:18 IST

ముట్టుకుంటే మోగుతుంది!

తల్లీబిడ్డకు కట్టిన ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగులు

శిశువు పుట్టగానే ఆర్‌ఎఫ్‌ఐడీ నంబరు కేటాయించి, ఆ ట్యాగును మాతాశిశువులకు కడతారు. అపహరించాలని ఎవరైనా శిశువును తాకగానే ఆ గదిలో ఏర్పాటుచేసిన రేడియో ఫ్రీక్వెన్సీ అలారం మోగుతుంది. భద్రతా సిబ్బంది అప్రమత్తం అవుతారు.

ఏలూరు ప్రభుత్వాసుపత్రి, న్యూస్‌టుడే: ప్రభుత్వాసుపత్రుల్లో కొన్నిచోట్ల తల్లుల కళ్లుగప్పి శిశువులను మాయం చేసిన సందర్భాలున్నాయి. శిశువులను మార్చేసిన ఘటనలూ ఉన్నాయి. ఇటువంటి వాటి నియంత్రణకు, శిశువులకు పూర్తి భద్రత కల్పించేందుకు రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్‌ను తెరపైకి తెచ్చారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్‌ఎఫ్‌ఐడీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ విధానాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో అమలుచేస్తున్నారు. దశల వారీగా ఇతర ఆసుపత్రులకు విస్తరించనున్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి మాతాశిశు సంరక్షణ విభాగంలో నిత్యం 100 మంది బాలింతలు ఉంటారు. ఆర్‌ఎఫ్‌ఐడీ ద్వారా వారికి భద్రత కల్పించారు. ‘‘తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, భీమవరం తదితర ఆసుపత్రుల్లోనూ ఈ విధానాన్ని అమలు చేస్తాం.’’ అని డీసీహెచ్‌ఎస్‌ మోహన్‌ తెలిపారు.

ప్రసూతి విభాగంలో అలారం సిస్టమ్‌

Read latest West-godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని