Published : 07 Dec 2021 04:37 IST
సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
మాట్లాడుతున్న నాగేశ్వరరావు నాయక్
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: విద్యుత్తు ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎలక్ట్రీసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఐదు జిల్లాల డిస్కం అధ్యక్షుడు నాగేశ్వరరావు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని గమిని ఫంక్షన్ హాలులో యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 22 వేల మంది కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. నాలుగు విడతల డీఏ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షుడు కృష్ణంరాజు, జిల్లా కార్యదర్శి వి.రాము తదితరులు పాల్గొన్నారు.
Tags :