logo

ఉద్యోగుల ఉద్యమ బాట

ఉద్యోగులు మంగళవారం నుంచి ఉద్యమబాట పట్టనున్నారు. 11వ పీఆర్‌సీ అమలు చేయాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని, డీఏ బకాయిలు చెల్లించాలని తదితర డిమాండ్ల సాధనకు ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి దశలవారీ ఆందోళనకు పిలుపునిచ్చాయి.

Published : 07 Dec 2021 04:37 IST

నేటి నుంచి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ఉద్యోగులు మంగళవారం నుంచి ఉద్యమబాట పట్టనున్నారు. 11వ పీఆర్‌సీ అమలు చేయాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని, డీఏ బకాయిలు చెల్లించాలని తదితర డిమాండ్ల సాధనకు ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి దశలవారీ ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నెల 7, 8, 9 తేదీల్లో నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకానున్నారు. 10న మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలు, సమావేశాలు నిర్వహించనున్నారు. 13న తాలూకా కేంద్రాల్లో, 21న జిల్లా కేంద్రంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా, జనవరి 3న సాయంత్రం 4 గంటలకు ఏలూరులో ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛనర్లు పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ ఎన్‌జీవో సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హరనాథ్‌, శ్రీనివాసరావు, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు కె.రమేశ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని