logo

పోలీసు ప్రతిష్ఠనుమరింత పెంచండి: డీఐజీ

హోంగార్డులు సమాజానికి మెరుగైన సేవలందిస్తున్నారని, వారి సేవలు అమూల్యమని ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు అన్నారు. మరింత బాగా పనిచేసి పోలీసు ప్రతిష్ఠను పెంచాలన్నారు. హోంగార్డుల దినోత్సవాన్ని ఏలూరులోని పోలీసు మైదానంలో

Published : 07 Dec 2021 04:37 IST

గౌరవ వందనం స్వీకరిస్తున్న మోహనరావు, పక్కన పోలీసు అధికారులు

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: హోంగార్డులు సమాజానికి మెరుగైన సేవలందిస్తున్నారని, వారి సేవలు అమూల్యమని ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు అన్నారు. మరింత బాగా పనిచేసి పోలీసు ప్రతిష్ఠను పెంచాలన్నారు. హోంగార్డుల దినోత్సవాన్ని ఏలూరులోని పోలీసు మైదానంలో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మోహనరావు మాట్లాడుతూ కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా సేవలందించారన్నారు. కానిస్టేబుళ్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న హోంగార్డులకు ఐదేళ్ల వయసు సడలింపు ఇస్తున్నామన్నారు. ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డులను ఆదుకునేందుకు ఒకరోజు వేతనాన్ని వారు స్వచ్ఛందంగా అందిస్తున్నారన్నారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు.

మైదానంలో కవాతు చేస్తున్న హోంగార్డులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని