Updated : 07 Dec 2021 05:15 IST
అత్తిలిలో రేపటి నుంచి షష్ఠి ఉత్సవాలు
అత్తిలి, న్యూస్టుడే: అత్తిలి సుబ్రహ్మణ్య క్షేత్రంలో బుధవారం నుంచి షష్ఠి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మందికి పైగా భక్తులు ఏటా ఇక్కడికి వస్తుంటారు. ఈ నెల 8వ తేదీ బుధవారం రాత్రి 7.09 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. గురువారం తీర్థం నిర్వహిస్తారు. ఆ రోజు వచ్చే భక్తులకు ఉదయం పది నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్నప్రసాదం అందేలా స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి పదిహేను రోజులపాటు కళావేదికపై సాంస్కృతిక, ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Tags :