Published : 07 Dec 2021 04:43 IST
పాఠశాలల్లో మరుగు సమస్య
ఏలూరు విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో వినియోగంలో లేని మరుగుదొడ్లు పాఠశాలలు/అంగన్వాడీ కేంద్రాలు 838 ఉన్నాయి. రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చిన ఓ ప్రశ్నకు సమాధానంతో కూడిన దేశవ్యాప్త సమగ్ర వివరాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. అందులో జిల్లాకు సంబంధించి వాడుకకు వీలులేని మరుగుదొడ్లు గ్రామీణ ప్రాంతాల్లో 769, అర్బన్‌లో 69.. చేతులను శుభ్రం చేసుకునేందుకు వసతులు లేనివి గ్రామీణంలో 559, అర్బన్‌లో 53 చోట్ల ఉన్నట్లు వెల్లడించారు.
Tags :