logo

కోడి పందేలను అడ్డుకున్న జనసేన నాయకులు

సంక్రాంతి సందర్భంగా తణుకు మండలం మండపాకలో నిర్వహిస్తున్న కోడి పందేలను జనసేన పార్టీ నాయకులు శుక్రవారం అడ్డుకున్నారు. సంక్రాంతికి గ్రామంలో ఎటువంటి పందేలు, జూదాలు, పేకాట, గుండాట వంటి వాటిని నిర్వహించకూడదని రెండు రోజుల ముందు నుంచే పంచాయతీ ప్రజాప్రతినిధులు, అధికారులు టాంటాం వేయించారు

Published : 15 Jan 2022 01:41 IST


మండపాక కోడి పందేల వద్ద పడవేసిన టెంట్లు

తణుకు, న్యూస్‌టుడే: సంక్రాంతి సందర్భంగా తణుకు మండలం మండపాకలో నిర్వహిస్తున్న కోడి పందేలను జనసేన పార్టీ నాయకులు శుక్రవారం అడ్డుకున్నారు. సంక్రాంతికి గ్రామంలో ఎటువంటి పందేలు, జూదాలు, పేకాట, గుండాట వంటి వాటిని నిర్వహించకూడదని రెండు రోజుల ముందు నుంచే పంచాయతీ ప్రజాప్రతినిధులు, అధికారులు టాంటాం వేయించారు. అయినా అధికార పార్టీ నాయకులు గ్రామంలో కోడి పందేలు నిర్వహించడంతో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచి జానా వెంకటలక్ష్మి, ఉపాధ్యక్షుడు వట్టికూటి శివనాగప్రసాద్‌, వార్డు సభ్యులు అడ్డుకున్నారు. కోడి పందేలు, పేకాట, గుండాటలు మా కొద్దు అంటూ నినాదాలు చేశారు. పందేలు నిర్వహిస్తే తాము పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో అధికార, జనసేన పార్టీలకు చెందిన వర్గాల మధ్య వివాదం తలెత్తింది. తణుకు సీఐ సీహెచ్‌ ఆంజనేయులు, ఎస్సై ఎం.రాజకుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి పందేలను నిలుపుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని