logo

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం: కలెక్టర్‌

క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం సమీపంలోని ఏపీ నిట్‌ వద్ద జాతీయరహదారిపై శుక్రవారం జరిగిన లారీ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా 10 మందికి గాయపడ్డారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న మహ్మద్‌

Published : 15 Jan 2022 01:41 IST


బాధితుడిని పరామర్శిస్తున్న కార్తికేయ మిశ్రా

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం సమీపంలోని ఏపీ నిట్‌ వద్ద జాతీయరహదారిపై శుక్రవారం జరిగిన లారీ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా 10 మందికి గాయపడ్డారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న మహ్మద్‌ ఖలీల్‌, వసీకర్‌ రెహమాన్‌, సమావుల్‌ అన్సారీలను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న వీరిని కలెక్టర్‌ పరామర్శించారు. స్కానింగులు తీసిన తర్వాత వారికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉన్నట్లు తెలిసిందని, అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని డీసీహెచ్‌ఎస్‌ ఏవీఆర్‌ మోహన్‌ కలెక్టర్‌కు వివరించారు. డ్రైవర్‌ మద్యం తాగి ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారని, దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కలెక్టర్‌ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతుల కుటుంబ సభ్యుల ఇష్ట ప్రకారం తాడేపల్లిగూడెంలో అంత్యక్రియలు నిర్వహించాలా, స్వస్థలాలకు తరలించాలా అనే విషయాలను పరిశీలించాలని ఆర్డీవో, డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని