logo

వారాలు ఉండి సంగీత విద్యను అభ్యసించా: పద్మశ్రీ రామస్వామి

వారాలు ఉండి సంగీత విద్యను నేర్చుకున్నాను. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి నా తల్లిదండ్రులు, గురువులే కారణం’ అని ప్రముఖ వయోలిన్‌ విద్వాంసుడు పద్మశ్రీ డాక్టరు అన్నవరపు రామస్వామి అన్నారు. దెందులూరు మండలం సోమవరప్పాడు శుక్రవారం వచ్చిన ఆయన స్థానిక రామాలయంలో పూజలు చేశారు.

Published : 15 Jan 2022 01:41 IST


అన్నవరపు రామస్వామిని సత్కరిస్తున్న గ్రామస్థులు

సోమవరప్పాడు (దెందులూరు),న్యూస్‌టుడే: ‘వారాలు ఉండి సంగీత విద్యను నేర్చుకున్నాను. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి నా తల్లిదండ్రులు, గురువులే కారణం’ అని ప్రముఖ వయోలిన్‌ విద్వాంసుడు పద్మశ్రీ డాక్టరు అన్నవరపు రామస్వామి అన్నారు. దెందులూరు మండలం సోమవరప్పాడు శుక్రవారం వచ్చిన ఆయన స్థానిక రామాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు శాలువా, పూలమాలలు, నూతన వస్త్రాలతో ఆయన్ని సత్కరించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ఆరోగ్యం విషయంలో తనకు తానే గైడు అన్నారు. కోరికలను జయించి, మనలోని తప్పులను తీసి పారేస్తే సంతోషంగా జీవించవచ్చన్నారు. మనలను మనమే తగ్గించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ మాగంటి సురేంద్రనాథ్‌ చౌదరి, మాగంటి వీరేంద్రప్రసాద్‌(బబ్బు), మాగంటి రవిబాబు, మాగంటి బోసు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని