logo

పుట్టిన ఊరికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా

క్రీడలపై యువత ఆసక్తి కనబర్చాలని రాష్ట్ర సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ అన్నారు. ఆయన తల్లి ‘పాతాళ గ్రేస్‌ దయామణి’ జ్ఞాపకార్థం స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసేందుకు క్రికెట్‌,

Published : 15 Jan 2022 01:41 IST


క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న సునీల్‌కుమార్‌

చింతలపూడి, న్యూస్‌టుడే: క్రీడలపై యువత ఆసక్తి కనబర్చాలని రాష్ట్ర సీఐడీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ అన్నారు. ఆయన తల్లి ‘పాతాళ గ్రేస్‌ దయామణి’ జ్ఞాపకార్థం స్థానిక జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్‌ పోటీలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసేందుకు క్రికెట్‌, కబడ్డీలాంటి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నానన్నారు. చదవాలనే కాంక్ష , ప్రతిభ ఉన్న పేదవిద్యార్థులకు గ్రూప్స్‌ శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. పుట్టిన ఊరుకి సేవ చేయడంలో ఎంతో తృప్తి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా కాసేపు క్రీడాకారులతో క్రికెట్‌ ఆడి ఉత్సాహపరిచారు. స్థానికంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు ఎయిమ్‌ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు మదిరి రాంబాబు, జడ్పీటీసీ సభ్యులు ఎం.నీరజ, ఎంపీపీ బి.రాంబాబు, కాకర్ల సత్యం, ఎన్‌ఎస్‌ఎన్‌ రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని