logo

ఆత్మీయ సమ్మేళనం

వాండ్రం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా శుక్రవారం పట్టభద్రుల ‘ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో స్థిరపడిన గ్రామానికి చెందినవారంతా ఒక చోట చేరి సందడి చేశారు. భోగి మంట వేసి ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన

Published : 15 Jan 2022 01:41 IST


హాజరైన పట్టభద్రులు

వాండ్రం (ఉండి), న్యూస్‌టుడే: వాండ్రం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా శుక్రవారం పట్టభద్రుల ‘ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో స్థిరపడిన గ్రామానికి చెందినవారంతా ఒక చోట చేరి సందడి చేశారు. భోగి మంట వేసి ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సర్పంచి దాసరి వెంకటకృష్ణ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పట్టభద్రులంతా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయుడు, లయన్స్‌ క్లబ్‌ మాజీ అధ్యక్షుడు పెన్మెత్స కృష్ణంరాజు, సర్పంచి వెంకటకృష్ణ, సత్యనారాయణ, పెన్మెత్స రామకృష్ణ ఆంజనేయరాజులను సన్మానించారు. వడ్డి వేణుగోపాలకృష్ణ, నల్లం వెంకటేష్‌, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని