logo

విపత్తులను సమర్థంగా ఎదుర్కోవాలి

అనుకోని పరిస్థితుల్లో విపత్తులు తలెత్తినప్పుడు వాటిని సమర్ధంగా ఎదుర్కోవాలని అందుకు సంసిద్ధంగా ఉండాలని రెడ్‌ క్రాస్‌ జిల్లా ఛైర్మన్‌ బీవీ కృష్ణారెడ్డి అన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని రెడ్‌క్రాస్‌ భవన్‌లో బుధవారం వివిధ శాఖల సిబ్బందికి,

Published : 20 Jan 2022 01:57 IST

మాట్లాడుతున్న రెడ్‌క్రాస్‌ జిల్లా ఛైర్మన్‌ కృష్ణారెడ్డి

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: అనుకోని పరిస్థితుల్లో విపత్తులు తలెత్తినప్పుడు వాటిని సమర్ధంగా ఎదుర్కోవాలని అందుకు సంసిద్ధంగా ఉండాలని రెడ్‌ క్రాస్‌ జిల్లా ఛైర్మన్‌ బీవీ కృష్ణారెడ్డి అన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని రెడ్‌క్రాస్‌ భవన్‌లో బుధవారం వివిధ శాఖల సిబ్బందికి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో విపత్తుల నివారణకు సంబంధించి శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిఫగా హాజరైన కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద విపత్తు కరోనా అని దాన్ని అన్ని శాఖల సమన్వయంతో మొదటి, రెండు దశలను జిల్లాలో సమర్థంగా ఎన్నుకున్నామన్నారు. అదే స్ఫూర్తితో 3వ దశ కరోనా, ఒమిక్రాన్‌ నివారణకు కృషి చేయాలన్నారు. ఈ క్రమంలో బాధితులను రక్షించటం ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలగడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ప్రాజెక్టు మేనేజర్‌ డాక్టర్‌ పూర్ణచంద్‌, రెడ్‌క్రాస్‌ రాష్ట్ర ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ అన్నమ్మ, రెడ్‌క్రాస్‌ రిసోర్స్‌ పర్సన్‌ సత్యనారాయణ తదితరులు విపత్తులను ఎదుర్కోవటం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ కార్యదర్శి బెన్నీ, రెడ్‌క్రాస్‌ వైద్యులు వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని