logo

ఒక పుస్తకం మాయం ?

జంగారెడ్డిగూడెం సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నమోదు చేసే ఒక వాల్యూమ్‌ (పుస్తకం) మాయమైనట్లుగా సమాచారం. ఇది కార్యాలయం నుంచి ఎక్కడికి వెళ్లింది. ఎప్పుడు మాయమైంది. తదితరాల విషయాలపై విజిలెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు.

Published : 20 Jan 2022 01:57 IST

ముగిసిన విజిలెన్స్‌ తనిఖీలు

రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు నమోదు చేసే ఒక వాల్యూమ్‌ (పుస్తకం) మాయమైనట్లుగా సమాచారం. ఇది కార్యాలయం నుంచి ఎక్కడికి వెళ్లింది. ఎప్పుడు మాయమైంది. తదితరాల విషయాలపై విజిలెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లాలోని పలు సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల్లో రికార్డులు మాయమయ్యాయన్న ఫిర్యాదులపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా విజిలెన్స్‌ డీఎస్పీ ఎస్‌.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళ, బుధవారాల్లో రికార్డులు పరిశీలించారు. ఈ పరిశీలనలో బుక్‌ 1 వాల్యూమ్‌ ఒకటి మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఇది 2000కు ముందు పుస్తకం. ఇందులో సుమారు 200కుపైగా రిజిస్ట్రేషన్లు నమోదై ఉండవచ్చని తెలిసింది. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. మాయమైన రికార్డు ఎవరి కాలం నుంచి కనిపించడం లేదన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని