logo

చెరువుల అభివృద్ధితో భూగర్భ జలాల పెరుగుదల

చెరువులను అభివృద్ధి చేయడం ద్వారా భూగర్భ జలాల పెరుగుదల సాధ్యమవుతుందని ఏపీ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకం సహాయ పథక సంచాలకుడు జి.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రాజానగరం, మెరకగూడెంలలో సేవా స్వచ్ఛంద

Published : 20 Jan 2022 01:57 IST

రాజానగరంలో అవగాహన ప్రదర్శన చేస్తున్న అధికారులు, సంస్థ ప్రతినిధులు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: చెరువులను అభివృద్ధి చేయడం ద్వారా భూగర్భ జలాల పెరుగుదల సాధ్యమవుతుందని ఏపీ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకం సహాయ పథక సంచాలకుడు జి.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. రాజానగరం, మెరకగూడెంలలో సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం చెరువుల అభివృద్ధి, సద్వినియోగంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎంపిక చేసిన 9 మండలాల పరిధిలోని 33 గ్రామాల్లో చెరువులను అభివృద్ధి చేసి పది వేల ఎకరాల భూమికి సాగునీటిని అందిస్తున్నట్లు వివరించారు. అనంతరం ఆయా గ్రామాల్లో అవగాహన ప్రదర్శన చేశారు. మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. పథకం జిల్లా రిసోర్స్‌ పర్సన్‌ టీఎన్‌ స్నేహన్‌, స్వచ్ఛంద సంస్థ సమన్వయకర్త యు.రాజ్‌కుమార్‌, సర్పంచులు కుంజా దుర్గమ్మ, సోదెం గంగాదేవి, పలువురు రైతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని