logo

ఔషధాల ధరలు నియంత్రించండి

అత్యవసర ఔషధాల ధరలు నియంత్రించాలని, ఆన్‌లైన్‌ విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ ఏపీ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ సంఘం సభ్యులు బుధవారం సమ్మె చేశారు. భీమవరంలో తాలూకాఫీసు కూడలిలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో సంఘం

Published : 20 Jan 2022 01:57 IST

నినాదాలు చేస్తున్న మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ల సంఘ సభ్యులు

భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే: అత్యవసర ఔషధాల ధరలు నియంత్రించాలని, ఆన్‌లైన్‌ విక్రయాలను నిలిపివేయాలని కోరుతూ ఏపీ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ సంఘం సభ్యులు బుధవారం సమ్మె చేశారు. భీమవరంలో తాలూకాఫీసు కూడలిలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో సంఘం పట్టణశాఖ అధ్యక్షుడు ఎస్‌.శిరీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో సభ్యులు పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. సంఘం ఉపాధ్యక్షుడు ఎస్‌.శ్రీనివాస్‌, కార్యదర్శి కె.సూర్యచంద్రరాజు పాల్గొన్నారు. యూటీఎఫ్‌ నాయకుడు గోపిమూర్తి, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రసాద్‌, సీఐటీయూ నాయకులు, వైద్యులు వారికి సంఘీభావం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని