logo

ఆర్టీసీకి కాసుల పండుగ

సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసులపంట పండించింది. జిల్లాతోపాటు, ఇతర ప్రాంతాలకు బస్సులు నడపడంతో సంస్థకు రూ.3.75 కోట్ల ఆదాయం సమకూరింది. ఆరు రోజులకు ఈ మొత్తం వచ్చినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం వీరయ్య చౌదరి తెలిపారు.

Published : 20 Jan 2022 01:57 IST

సంక్రాంతి ఆదాయం రూ.3.75 కోట్లు

తాడేపల్లిగూడెం డిపోలో ప్రయాణికుల తాకిడి

తాడేపల్లిగూడెం పట్టణం, న్యూస్‌టుడే : సంక్రాంతి పండుగ ఆర్టీసీకి కాసులపంట పండించింది. జిల్లాతోపాటు, ఇతర ప్రాంతాలకు బస్సులు నడపడంతో సంస్థకు రూ.3.75 కోట్ల ఆదాయం సమకూరింది. ఆరు రోజులకు ఈ మొత్తం వచ్చినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం వీరయ్య చౌదరి తెలిపారు. ఈ నెల 13నుంచి 18వ తేదీ వరకూ సంక్రాంతి ముందు నుంచి పండుగ పూర్తయ్యే వరకు సాధారణ రోజులకన్నా రెట్టింపు ఆదాయం ఆర్టీసీకి వచ్చింది. జిల్లాలోని 8 డిపోల నుంచి బస్సులు లక్షల కిలోమీటర్లు తిరిగాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

677 బస్సులు.. 12.63 లక్షల కి.మీ. ప్రయాణం

జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లో ఆరు రోజులు 677 బస్సులు ప్రయాణించటంతో ఇంత ఆదాయం సమకూరింది. 423 పల్లె వెలుగు బస్సులు 8 డిపోలలో జిల్లా వ్యాప్తంగా ప్రయాణికులను చేరవేశాయి. వీటితోపాటు 127 అద్దె బస్సులు కూడా తిరిగాయి. ఏసీ ఇంద్ర, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు, వాల్వో, సూపర్‌ ఫాస్టు బస్సులు హైదరాబాద్‌, విశాఖ, శ్రీకాకుళం, కడప, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు జిల్లా నుంచి ఆరు రోజులపాటు అవిశ్రాంతంగా తిరుగుతూనే ఉన్నాయి. దీంతో మొత్తం 12.63 లక్షల కి.మీ. ప్రయాణం పండుగకు సాగింది. జిల్లాలోని 8 డిపోలలో ఉన్న పాడైన బస్సులను కూడా సరిచేయించి పండుగకు వినియోగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని