logo

నాలుగు రోజులు ఆగి రండి

జంగారెడ్డిగూడెం లో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ రోజుకు అయిదుగురి కే చేస్తున్నారు. శనివారం ముగ్గురికి మాత్రమే చేసి.. మిగిలిన రెండు కిట్లు గర్భవతులు ఎవరైనా రాచ్చునన్న ఉద్దేశంతో అట్టి పెట్టారు.

Updated : 23 Jan 2022 05:14 IST

కొవిడ్‌ పరీక్షలు రోజుకు ఐదుగురికేనట

జంగారెడ్డిగూడెం ఆస్పత్రి వద్ద ఫ్లెక్సీ ఇలా..

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం లో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ రోజుకు అయిదుగురి కే చేస్తున్నారు. శనివారం ముగ్గురికి మాత్రమే చేసి.. మిగిలిన రెండు కిట్లు గర్భవతులు ఎవరైనా రాచ్చునన్న ఉద్దేశంతో అట్టి పెట్టారు. లక్షణాలు ఉన్నవారు వస్తే గతంలో వెంటనే నమూనాలు సేకరించి పరీక్షలకు పంపేవారు. రెండు, మూడు రోజుల్లో ఫలితాలు వచ్చేవి. వాటి ద్వారా బాధితులు పాజిటివ్‌ అయితే తగిన చికిత్స పొందేవారు. ప్రస్తుతం తీరు మారింది. నేరుగా పరీక్షలు చేసేది లేదని ప్రాంతీయ ఆసుపత్రిలో శనివారం ఏకంగా బోర్డులు పెట్టారు. జ్వరం, జలుబు ఉన్న వ్యక్తులు వైద్యుని పర్యవేక్షణలో చికిత్స పొంది ఉండాలని, మూడు, నుంచి నాలుగు రోజులు జ్వరంతో బాధపడితే అప్పటికీ తగ్గని వారికి మాత్రమే పరీక్షలు చేస్తామంటూ బోర్డుల్లో పేర్కొన్నారు. ఎవరైనా వస్తే సాధారణ వైద్య పరీక్షలకు వెళ్లాలని సూచించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఆసుపత్రి ముందు భాగంలో ఉన్న రోగుల సహాయకుల నిరీక్షణ గదిలో నమూనాలు తీసేవారు. ఈ విభాగాన్ని శనివారం నిలిపివేశారు. అదే ప్రాంతంలో ఈ ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమకున్న ఆదేశాల ప్రకారం రోజుకు అయిదుగురికి మాత్రమే పరీక్షలు చేస్తున్నామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వజ్రకిరణ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు