logo

పోలీసులు మూల్యం చెల్లించుకోకతప్పదు: తెదేపా

‘గుడివాడ ఘటనపై వాస్తవాలు తెలుసుకోకుండా మాపై ఇష్టమొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడిన డీఐజీని.. ఇదేంటని అడుగుదామనుకున్నాం. ‘నేను బిజీగా ఉన్నాను.. గుడివాడలో ఫిర్యాదివ్వండి’ అన్నారు. ‘గుడివాడ పోలీసుల మీద వాళ్లకే ఫిర్యాదు చేయడమేంటి?

Published : 23 Jan 2022 03:53 IST

డీఐజీ కార్యాలయానికి వెళ్తున్న నాయకులు వర్ల

రామయ్య, కొనకళ్ల, ఆలపాటి, బోండా ఉమా తదితరులు

ఈనాడు డిజిటల్‌, ఏలూరు: ‘గుడివాడ ఘటనపై వాస్తవాలు తెలుసుకోకుండా మాపై ఇష్టమొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడిన డీఐజీని.. ఇదేంటని అడుగుదామనుకున్నాం. ‘నేను బిజీగా ఉన్నాను.. గుడివాడలో ఫిర్యాదివ్వండి’ అన్నారు. ‘గుడివాడ పోలీసుల మీద వాళ్లకే ఫిర్యాదు చేయడమేంటి? మీకే ఇవ్వాలి మీరే చర్యలు తీసుకోవాలి’ అని అడిగితే సమాధానం లేదు. ఏలూరు వచ్చినా అందుబాటులో లేకపోవడంతో తిరిగి మేసేజి పెట్టాం. రాలేదు. చేసేది లేక మేనేజర్‌కు ఫిర్యాదు ఇచ్చి తిరిగొచ్చాం. పోలీసులు పద్ధతి మార్చుకోవాలి’ అంటూ తెదేపా నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కె.కన్వెన్షన్‌ సెంటర్‌లో క్యాసినో గేమ్స్‌ నిర్వహించినట్లు వచ్చిన ఆరోపణలపై ఏర్పాటైన తెదేపా నిజనిర్ధారణ కమిటీ సభ్యులు.. మాజీ ఎంపీీ కొనకళ్ల నారాయణ, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, కొల్లు రవీంద్ర, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు శనివారం డీఐజీని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ఏలూరు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైకాపా వారికి కొమ్ముకాస్తున్న పోలీసులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని