logo

సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం : డీఐజీ

నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటంతో కొంత కాలంగా సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని వీటిబారిన పడకుండా ప్రతిఒక్కరూ అవగాహనతో ఉండాలని ఏలూరు డీఐజీ కె.వి.మోహనరావు అన్నారు. భీమడోలు పోలీసు స్టేషన్‌ను ఆయన

Published : 23 Jan 2022 03:53 IST

భీమడోలు పోలీసు స్టేషన్‌ పరిసరాలను పరిశీలిస్తున్న మోహనరావు

భీమడోలు, న్యూస్‌టుడే: నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటంతో కొంత కాలంగా సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని వీటిబారిన పడకుండా ప్రతిఒక్కరూ అవగాహనతో ఉండాలని ఏలూరు డీఐజీ కె.వి.మోహనరావు అన్నారు. భీమడోలు పోలీసు స్టేషన్‌ను ఆయన శనివారం పరిశీలించారు. కార్యాలయంలోని దస్త్రాలు, అధికారులు ఉపయోగించే వాహనాలు, సిబ్బంది క్వార్టర్లను పరిశీలించారు. సచివాలయ మహిళా పోలీసులతో వారి పనితీరును ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌ మోసాలు పెరుగుతున్నాయన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, బహుమతులు వచ్చాయంటూ అపరిచితులు పంపే వెబ్‌ లింకుల విషయంలో స్పందించవద్దని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై వి.ఎస్‌.వి.భద్రరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని