logo

మంచి ఫలితాలు సాధించాలి: కలెక్టర్‌

విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సూచించారు. సత్రంపాడు జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన శనివారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. సైన్స్‌, గణితం, సాంఘికశాస్త్రాలకు

Published : 23 Jan 2022 03:53 IST

విద్యార్థులతో కూర్చొని పాఠం వింటున్న కార్తికేయ మిశ్రా

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సూచించారు. సత్రంపాడు జడ్పీ ఉన్నత పాఠశాలను ఆయన శనివారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. సైన్స్‌, గణితం, సాంఘికశాస్త్రాలకు సంబంధించిన పాఠ్యాంశాల్లోని పలు ప్రశ్నలకు సమాధానాలు అడిగి విద్యార్థుల సామర్థ్యాలు తెలుసుకున్నారు. బోర్డుపై మ్యాప్‌ పాయింటింగ్‌ చేయించారు. విద్యార్థులతో కూర్చొని పాఠ్యాంశాలను విన్నారు. కలెక్టర్‌ అడిగిన ప్రశ్నలకు వారు సరిగా సమాధానాలు చెప్పటంతో ఆయన సంతృప్తి చెందారు. కార్యక్రమంలో డీఈవో రేణుక, ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని