logo

కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్‌ బాధ్యతల స్వీకరణ

జిల్లాకు కొత్త కలెక్టర్‌గా నియమితులైన ప్రసన్న వెంకటేశ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తగిన కృషి చేస్తానన్నారు. ప్రజా వినతుల పరిష్కారంతోపాటు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రతి కుటుంబానికి మెరుగైన సేవలందిస్తామన్నారు. నవరత్నాలు,

Published : 27 Jan 2022 06:00 IST

 

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాకు కొత్త కలెక్టర్‌గా నియమితులైన ప్రసన్న వెంకటేశ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తగిన కృషి చేస్తానన్నారు. ప్రజా వినతుల పరిష్కారంతోపాటు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రతి కుటుంబానికి మెరుగైన సేవలందిస్తామన్నారు. నవరత్నాలు, సంక్షేమ కార్యక్రమాలు, ధాన్యం కొనుగోళ్లు, ఉపాధి పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలకు తగిన ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. జేసీలు హిమాన్షు శుక్లా, అంబేడ్కర్‌, పద్మావతి తదితరులు కొత్త కలెక్టర్‌కు అభినందనలు తెలియజేశారు.

బాలుర వసతి గృహం తనిఖీ

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఏలూరులోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహాన్ని విధుల్లో చేరిన కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులను ఐదు, ఎనిమిది తరగతులకు సంబంధించిన సబ్జెక్టులపై ప్రశ్నలు వేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, ఆహారపదార్థాలు, మరుగుదొడ్లు పరిశీలించారు. సంయుక్త కలెక్టర్‌ (సంక్షేమం) పద్మావతి పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని