logo

విద్యతోనే సమాజ అభివృద్ధి

ఏ ప్రాంతమైన విద్యతోనే అభివృద్ధి చెందుతుందని, అందుకు తగ్గట్టుగా ఎన్నో కోర్సులను ప్రవేశపెట్టి వేలాది కుటుంబాలకు ఉపాధి బాట చూపిన విద్యా సంస్థ డీఎన్నార్‌ అని విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి కేవీ చౌదరి అన్నారు. డీఎన్నార్‌, ఎస్‌ఆర్‌కేఆర్‌ విద్యాసంస్థల మాజీ ఛైర్మన్‌ గోకరాజు రంగరాజు జయంతి సంద

Published : 27 Jan 2022 06:00 IST


గోకరాజు రంగరాజు విగ్రహావిష్కరణలో పాల్గొన్న ప్రముఖులు

 

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఏ ప్రాంతమైన విద్యతోనే అభివృద్ధి చెందుతుందని, అందుకు తగ్గట్టుగా ఎన్నో కోర్సులను ప్రవేశపెట్టి వేలాది కుటుంబాలకు ఉపాధి బాట చూపిన విద్యా సంస్థ డీఎన్నార్‌ అని విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి కేవీ చౌదరి అన్నారు. డీఎన్నార్‌, ఎస్‌ఆర్‌కేఆర్‌ విద్యాసంస్థల మాజీ ఛైర్మన్‌ గోకరాజు రంగరాజు జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని భీమవరం డీఎన్నార్‌ కళాశాల ఆవరణలో బుధవారం కేవీ చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దంతులూరి నారాయణరాజు, రంగరాజుల ఉద్యమ స్ఫూర్తి, దూరదృష్టి, సమాజసేవను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కళాశాల ప్రాంగణంలో నిర్మించిన ఇండోర్‌ స్టేడియంను సుబ్బరాజు కుమారుడు గోకరాజు రామరాజు ప్రారంభించారు. ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు జీవీ నరసింహరాజు, గాదిరాజు బాబు, ఎన్‌వీ సత్యనారాయణరాజు, గోకరాజు రామరాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని