logo

పింఛన్లు.. ఇళ్ల స్థలాలు.. తాగునీటి సమస్యలు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే వినతులను అదే సమయంలో ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు, తాగునీటి ఇబ్బందులను పరిష్కరించాలని ప్ర

Published : 20 May 2022 06:03 IST

‘గడప గడపకు మన ప్రభుత్వం’లో వీటిపైనేే వినతులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే వినతులను అదే సమయంలో ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు, తాగునీటి ఇబ్బందులను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. ఉండి మండలం కోలమూరు పరిధి శ్రీరామపురంలో సుమారు 30 కుటుంబాలు నివసిస్తున్నాయి. తాగునీటి సౌకర్యం కల్పించాలని నియోజకవర్గ ఇన్‌ఛార్జి పి.వి.ఎల్‌.నరసింహరాజుకు విజ్ఞప్తి చేశారు. పాలకొల్లు నియోజకవర్గంలోని సగంచెర్వు గ్రామంలో నాలుగేళ్లుగా పింఛన్‌ కోసం తిరుగుతున్నానని, ఇప్పటికీ అర్హత పొందలేకపోయానని ఒక బాధితురాలు నియోజకవర్గ ఇన్‌ఛార్జి, జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ కవురు శ్రీనివాస్‌ వద్ద వాపోయారు. నాడు-నేడు పథకంలో విద్యాలయాలను అభివృద్ధి చేసి కార్పొరేట్‌ స్థాయి విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నామని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఉత్తరపాలెంలో జరిగిన కార్యక్రమంలో వివరించారు. నరసాపురంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను అధికారులకు వివరించి వెంటనే పరిష్కరించాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని