logo

ఆర్టీసీ బస్సులో పొగలు.. ప్రయాణికుల బెంబేలు

ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో ప్రాణ భయంతో ప్రయాణికులు కిటికీల నుంచి బయటకు దూకిన ఘటన అశ్వారావుపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే.. ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు

Published : 24 May 2022 04:28 IST

అశ్వారావుపేట గ్రామీణం : పొగలు వచ్చిన బస్సు వద్ద ప్రయాణికులు

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో ప్రాణ భయంతో ప్రయాణికులు కిటికీల నుంచి బయటకు దూకిన ఘటన అశ్వారావుపేట మండలంలో చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే.. ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఆదివారం రాత్రి అదే జిల్లా వేలేరుపాడు మండలం కొయిదా వెళ్లింది. తిరిగి సోమవారం ఉదయం జంగారెడ్డిగూడెం వెళ్తుండగా అశ్వారావుపేట మండలం వినాయకపురం వద్దకు వచ్చేసరికి బస్సులోంచి పెద్దఎత్తున పొగలు వచ్చాయి. దీంతో డ్రైవర్‌ బస్సును ఆపాడు. భయపడిన ప్రయాణికులు బస్సు కిటికీల నుంచి బయటకు దూకారు. బస్సులోని తీగలు కాలిపోవడం వల్లనే పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. ఘటనా సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులున్నారు. కొద్ది సమయం తర్వాత బస్సు జంగారెడ్డిగూడెం బయలుదేరి వెళ్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని