logo
Published : 24 May 2022 05:23 IST

ఇక్కడ ‘అల్లూరి’ వారసులు ఉన్నారా!

మోగల్లులో కలెక్టర్‌ ఆరా

స్థానికులతో మాట్లాడుతున్న ప్రశాంతి

మోగల్లు (పాలకోడేరు), న్యూస్‌టుడే: విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు స్వగ్రామమైన మోగల్లులో కలెక్టర్‌ పి.ప్రశాంతి సోమవారం పర్యటించారు. సీతారామరాజు కుటుంబం నివసించిన ప్రాంతంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికులతో మాట్లాడుతూ ఇక్కడ అల్లూరి వారసులు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీశారు. స్మారక స్తూపం నిర్మాణానికి అందుబాటులో ఉన్న స్థలం వివరాలను అడిగి తెలుసుకున్నారు. అల్లూరి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని కొత్తపల్లి సీతారామచంద్రరాజు ఆమెకు అందించారు. అనంతరం రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మంతెన యోగీంద్రకుమార్‌ మాట్లాడుతూ గ్రామంలో అల్లూరి సీతారామరాజు స్వగృహ పునర్నిర్మాణం, స్మారక స్తూపం, గ్రంథాలయం నిర్మాణాలు చేపట్టాలని కోరారు. స్మారక స్తూపం కోసం సేకరించిన స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. తహసీల్దారు మాధుసూదనరావు, ఎంపీడీవో వెంకటఅప్పారావు, సర్పంచి మల్లిపూడి కృష్ణకుమారి, కొత్తపల్లి మణిత్రీనాథరాజు పాల్గొన్నారు.

ప్రధాని పర్యటన కోసమేనా!.. జులై 4న నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం రానున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని పర్యటనపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక అధికారులు చెబుతున్నారు.

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts