logo
Published : 24 May 2022 05:23 IST

రాష్ట్రంలో మహిళలకు రక్షణేది?

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన

పాలకొల్లు న్యూస్‌టుడే: రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని నరసాపురం పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి అన్నారు. పాలకొల్లు ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ మహిళా కమిటీ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మహిళలు ఉద్యమించాల్సిన రోజులు వచ్చాయని రక్షణకోసం, హక్కులకోసం ప్రభుత్వంపై పోరాడాలని సూచించారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయం దగ్గర తెలుగు మహిళలు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని