logo

ధాన్యానికి డబ్బులివ్వలేని స్థితిలో ప్రభుత్వం: నిమ్మల

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక పోగా.. విక్రయించిన ధాన్యానికి కూడా డబ్బులివ్వ లేని ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లులో గురువారం

Published : 27 May 2022 03:43 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామానాయుడు

పాలకొల్లు, న్యూస్‌టుడే: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక పోగా.. విక్రయించిన ధాన్యానికి కూడా డబ్బులివ్వ లేని ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతోందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. పాలకొల్లులో గురువారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి రైతు విభాగం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెదేపా హయాంలో కర్షకులకు జరిగిన లబ్ధితో నేటి ప్రభుత్వం చేసిన మేలును పోల్చి చూపాలని తెలుగు రైతు నాయకులకు సూచించారు. నాయకులు బోణం నాని, రుద్రరాజు సత్యనారాయణరాజు, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, మామిడిశెట్టి పెద్దిరాజు, కోడి విజయభాస్కర్‌, జీవీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని