logo

పిల్లలకు ట్రాఫిక్‌ పాఠం మరిచారు!

రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా పిల్లలకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు చిల్డ్రన్‌ పార్కులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తోపాటు భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలు,

Published : 27 May 2022 03:43 IST

నిరుపయోగంగా పార్కులు

తణుకులో చిల్డ్రన్‌ ట్రాఫిక్‌ పార్కు

తణుకు, న్యూస్‌టుడే : రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా పిల్లలకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు చిల్డ్రన్‌ పార్కులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తోపాటు భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం పట్టణాల్లో ఒక్కో పార్కునకు రూ.5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు మున్సిపల్‌ నిధులు వెచ్చించి వీటిని అభివృద్ధి చేశారు. వీటిలో వాహనాలు ఏ విధంగా నడపాలి, పాఠశాలలు, వంతెనలు, ఆసుపత్రులు, కూడళ్లు ఉన్న ప్రదేశంలో ఏ గుర్తులు ఉంటాయి, వాటిని ఏ విధంగా గుర్తించాలనే అంశాలపై ప్రారంభంలో శిక్షణ ఇచ్చారు. ప్రధానంగా వేసవి సెలవుల్లో ఎక్కువగా వీటిని ఉపయోగించేవారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులకు పాఠశాలలు ముగిసిన అనంతరం, సెలవు దినాల్లో ఉపాధ్యాయుల సహకారంతో అవగాహన కల్పించారు. ప్రస్తుతం మున్సిపల్‌ అధికారులు పట్టించుకోక అన్ని చోట్లా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.

అందరికీ అర్థమయ్యేలా..

అందరికీ అర్థమయ్యే విధంగా పార్కుల్లో వాహనాలు నిలిపే ప్రదేశంలో వాహనాలు నిలపడానికని, వాహనం ఎడమవైపునకు తిరగడానికి, కుడి వైపు తిరగడానికి, రహదారి ఎత్తు పల్లాలుగా ఉందని సూచించే విధంగా ట్రాఫిక్‌ బోర్డులు ఏర్పాటు చేశారు. రేడియం స్టికర్లు, వివిధ రకాల ట్రాఫిక్‌ గుర్తులను తెలిపే బోర్డులు పెట్టారు. వీటి ప్రదర్శన ద్వారా పిల్లలకు అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రాథమిక స్థాయి నుంచి వారానికి ఒక పాఠశాల చొప్పున విద్యార్థులను పార్కులకు తీసుకొచ్చి వివరించాల్సి ఉంది. కాని ఎక్కడా అలా జరగడం లేదు. దీంతో రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సామగ్రి శిథిలస్థితికి చేరుతున్నాయి.

పార్కు లోపల ఇలా...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని