logo

బండి ముత్యాలమ్మ జాతరకు ఏర్పాట్లు

ముత్యాలపల్లిలోని బండిముత్యాలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో డి.రామకృష్ణంరాజు, ఛైౖర్మన్‌ కొల్లాటి రామారావు తెలిపారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఉత్సవ గోడపత్రాన్ని గురువారం ఆవిష్కరించారు.

Published : 27 May 2022 03:43 IST

గోడపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఆలయ పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు

మొగల్తూరు, న్యూస్‌టుడే: ముత్యాలపల్లిలోని బండిముత్యాలమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో డి.రామకృష్ణంరాజు, ఛైౖర్మన్‌ కొల్లాటి రామారావు తెలిపారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఉత్సవ గోడపత్రాన్ని గురువారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ జాతర నిర్వహణకు రూ.90 లక్షలు ఖర్చు చేసేందుకు దేవాదాయ శాఖ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఈ నెల 8న ఉత్సవాలకు అంకురార్పణ చేశామన్నారు. 29న చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అమ్మవారి జాతరను ప్రారంభించనున్నట్లు చెప్పారు. జూన్‌ 13 వరకు వేడుకలు ఉంటాయని వెల్లడించారు. భక్తుల వినోదం కోసం నాటక ప్రదర్శనలు, సంగీత విభావరి, కూచిపూడి, భరత నాట్యం, మేజిక్‌ ప్రదర్శన, భజనలు ఏర్పాటు చేశామని వివరించారు. జడ్పీటీసీ సభ్యుడు తిరుమాని బాపూజీ, సర్పంచి కొపనాతి పల్లయ్య, ఎంపీటీసీ సభ్యుడు తిరుమాని స్వామి, కర్రి ఏసు, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని