logo

అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలి: జనసేన

గోదావరి పక్కన ఉన్న కేదారేశ్వరస్వామి ఆలయ టోల్‌గేట్‌ పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్నారంటూ జనసేన నాయకులు గురువారం సిద్ధాంతం టోల్‌గేట్‌ వద్ద ఇసుక లారీలను అడ్డుకుని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మండల నాయకుడు కంబాల బాబులు

Published : 27 May 2022 03:43 IST

సిద్ధాంతంలో ఇసుక లారీలను అడ్డుకుంటున్న నాయకులు

పెనుగొండ గ్రామీణ, న్యూస్‌టుడే: గోదావరి పక్కన ఉన్న కేదారేశ్వరస్వామి ఆలయ టోల్‌గేట్‌ పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్నారంటూ జనసేన నాయకులు గురువారం సిద్ధాంతం టోల్‌గేట్‌ వద్ద ఇసుక లారీలను అడ్డుకుని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మండల నాయకుడు కంబాల బాబులు మాట్లాడుతూ సిద్ధాంతం గోదావరి తీరాన ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయని, సుదూర ప్రాంతాల నుంచి నిత్యం పదుల సంఖ్యలో భక్తులు వస్తుంటారన్నారు. శ్మశానం కూడా ఉండటంతో వివిధ మండలాల నుంచి అంత్యక్రియల నిమిత్తం మృతదేహాలను తీసుకొచ్చే వారు గేటు కారణంగా నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీకి ఆదాయం దక్కకుండా ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యల తీసుకోవాలని కోరారు. లేదంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సర్పంచి చింతపల్లి గనిరాజు, బొబ్బిలి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని