logo

భవనాల విలువ పెంపునకు ఆమోదం

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కట్టడాల (భవనాలు) విలువను జూన్‌ ఒకటో తేదీ నుంచి పెంచేందుకు సబ్‌రిజిస్ట్రార్ల కమిటీ ఆమోదం తెలిపింది. శుక్రవారం తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్‌ జేవీ మురళి అధ్యక్షతన సబ్‌రిజిస్ట్రార్లతో

Published : 28 May 2022 04:47 IST

సబ్‌రిజిస్ట్రార్లతో జేసీ సమీక్ష

జగనన్న కాలనీ లేఅవుట్‌ను పరిశీలిస్తున్న మురళి

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే: జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో కట్టడాల (భవనాలు) విలువను జూన్‌ ఒకటో తేదీ నుంచి పెంచేందుకు సబ్‌రిజిస్ట్రార్ల కమిటీ ఆమోదం తెలిపింది. శుక్రవారం తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో సంయుక్త కలెక్టర్‌ జేవీ మురళి అధ్యక్షతన సబ్‌రిజిస్ట్రార్లతో కూడిన కమిటీతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్లు హాజరై తమ కార్యాలయాల పరిధిలోని అర్బన్‌ ప్రాంతాల్లో ఆస్తుల విలువలతో కూడిన నివేదికలను అందజేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మరో మూడు నెలల్లో అన్ని సబ్‌రిజిస్ట్రారు కార్యాలయాల్లో రికార్డుల ఆన్‌లైన్‌ ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. కట్టడాల విలువ జూన్‌ 1వ తేదీ నుంచి వర్తిస్తుందని, వాటి విలువ ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరగాలని సబ్‌రిజిస్ట్రార్లకు సూచించారు. జిల్లా ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్‌ (కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌) సి.హెచ్‌.నాగలింగేశ్వరరావు కూడా కొత్త విలువల ప్రతిపాదనలపై సంతకాలు చేశారు.

లేఅవుట్‌ పరిశీలన.. తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో ఇటీవల వేసిన జగనన్న కాలనీ లేఅవుట్‌ను జేసీమురళి శుక్రవారం పరిశీలించారు.ప్రతి కాలనీలో మౌలికవసతులు కల్పించాలన్నారు. ఆయన వెంట గృహనిర్మాణ సంస్థ డీడీ రామరాజు, ఈఈ వెంకటరమణ, డీఈ ప్రసాదరాజు, అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని