logo

విద్యా శాఖదే ఇక పూర్తి పర్యవేక్షణ!

పురపాలక పాఠశాలలు అన్నింటినీ ప్రభుత్వం విద్యాశాఖ ఆధీనంలోకి బదిలీ చేసింది. వీటిపై పర్యవేక్షణ, అజమాయిషీ, పాలన వ్యవహారాలను ఇక నుంచి పాఠశాల విద్యాశాఖ చూస్తుంది. జిల్లా, మండల పరిషత్‌ పాఠశాలల్లో ఉన్న విధానాలనే వీటిలోనూ అమలు చేయనున్నారు. అయితే ఆస్తులు స్థానిక సంస్థల ఆధీనంలోనే ఉంటాయని పేర్కొంది. జిల్లాలోని

Published : 27 Jun 2022 05:31 IST

నరసాపురం, భీమవరం పట్టణం, న్యూస్‌టుడే

నరసాపురంలో ఎస్‌ఎన్‌ఎస్‌ పురపాలక ఉన్నత పాఠశాల

పురపాలక పాఠశాలలు అన్నింటినీ ప్రభుత్వం విద్యాశాఖ ఆధీనంలోకి బదిలీ చేసింది. వీటిపై పర్యవేక్షణ, అజమాయిషీ, పాలన వ్యవహారాలను ఇక నుంచి పాఠశాల విద్యాశాఖ చూస్తుంది. జిల్లా, మండల పరిషత్‌ పాఠశాలల్లో ఉన్న విధానాలనే వీటిలోనూ అమలు చేయనున్నారు. అయితే ఆస్తులు స్థానిక సంస్థల ఆధీనంలోనే ఉంటాయని పేర్కొంది. జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పురపాలకాల్లోని 149 పాఠశాలలు విద్యాశాఖ పరిధిలో చేరాయి. వీటిలో 23 ఉన్నత, 9 ప్రాథమికోన్నత, 117 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ జీవో విడుదల చేసింది. ఈ మున్సిపాలిటీలు ఏర్పాటైన నాటి నుంచి ఈ అయిదు పట్టణాల్లో పాఠశాల నిర్వహణ, బోధన పర్యవేక్షణ పురపాలక అధికారులే చూసుకున్నారు.ఇప్పటి వరకు ఈ పాఠశాలల్లో వినూత్న కార్యక్రమాలు, పదో తరగతి వారికి అధ్యయన సామగ్రి అందించడం, పలు సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీ  నుంచి నిధులు హెచ్చించేవారు. విద్యాశాఖ ఆధీనంలోకి వెళ్లడంతో ఇకపై మున్సిపాలిటీ పెత్తనం ఉండదు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల అభివృద్ధి, ఆంగ్ల మాధ్యమం అమలు, ఇతర అంశాల్లో మెరుగు కోసమే విద్యాశాఖలో విలీనం చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
 
*మున్సిపాలిటీల్లో జనాభా ఆధారంగా పాఠశాలలు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలోని స్థిరాస్తుల విలువ రూ. వందల కోట్లు ఉంటుందని అంచనా. ఈ ప్రక్రియను కొందరు వ్యతిరేకిస్తున్నప్పటికీ, అధికార పార్టీ కౌన్సిలర్లు, పాలక పెద్దల ఆదేశాలు పాటిస్తున్నారు.



 

జిల్లాలో 149 పురపాలక పాఠశాలల అప్పగింత
స్పష్టత అవసరం... విద్యాశాఖలో మున్సిపల్‌ పాఠశాలల విలీనాన్ని సిబ్బంది స్వాగతిస్తున్నారు. గతంలో పదో తరగతి పరీక్షల సన్నద్ధతకు పురపాలక అధికారులు ఒక రకమైన ప్రణాళిక, విద్యాశాఖ మరో ప్రణాళిక ఇచ్చేది. ఇలా అన్ని అంశాల్లో పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలపై షెడ్యూల్‌ వేర్వేరుగా ఉండేది. ఉపాధ్యాయులు సైతం గందగోళానికి గురయ్యేవారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇతర అంశాలకు సంబంధించి మున్సిపాలిటీ పరిధిలో ఒక రకంగా, విద్యాశాఖ పరిధిలో మరోలా ఉండేవి. మరోవైపు విలీనం వల్ల పురపాలక అధికారుల పర్యవేక్షణ తగ్గడం, పారిశుద్ధ్య, వాచ్‌మేన్‌ల నియామకం, వారి పనితీరుపై పెత్తనం తగ్గుతాయని, సమస్యలు పెరుగుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పర్యవేక్షణ కష్టతరం:   ఉపాధ్యాయుల నియామకం 2000కు ముందు పురపాలక సంస్థల ఆధ్వర్యంలో జరగగా, అనంతరం జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) నియామకాలు చేస్తోంది. వీరికి కూడా పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల వలే 010 పద్దు నుంచే వేతనాలు చెల్లిస్తున్నారు.
 
* సిబ్బంది సర్వీసు నిబంధనలను సంబంధించి ఎటువంటి ఉత్తర్వులు విడుదల చేయలేదు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని