logo

ఉప్పొంగిన స్ఫూర్తి

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వారోత్సవాలను త్యాగరాజ భవనం ప్రాంగణం వద్ద కలెక్టర్‌ పి.ప్రశాంతి, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు అల్లూరి, ఝాన్సీలక్ష్మీబాయి, పలు

Updated : 28 Jun 2022 07:02 IST

అల్లూరి జయంతి వారోత్సవాలు ప్రారంభం

ప్రసంగిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి, పక్కన ఎమ్మెల్యే శ్రీనివాస్‌ తదితరులు.

చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో చిన్నారులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వారోత్సవాలను త్యాగరాజ భవనం ప్రాంగణం వద్ద కలెక్టర్‌ పి.ప్రశాంతి, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు అల్లూరి, ఝాన్సీలక్ష్మీబాయి, పలువురు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణల్లో పట్టణ ప్రధాన రహదారి మీదుగా భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు, బోధకులు, సచివాలయాల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు తరలి వచ్చారు. తీన్‌మార్‌ డప్పు వ్యాయిద్యాలు, చిన్నారుల వేషధారణలతో ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎలాంటి వనరులు లేని రోజుల్లో ఆంగ్లేయ పాలకులపై పోరాడిన యోధుడు అల్లూరి అని కొనియాడారు. ఆయన స్ఫూర్తి, పోరాట పటిమను భావితరాలకు, ప్రపంచానికి చాటిచెప్పేలా ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఆర్డీవో దాసి రాజు, డీఈవో ఆర్‌.వెంకటరమణ, క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి సర్రాజు, భీమవరం పురపాలక కమిషనర్‌ ఎస్‌.శివరామకృష్ణ, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి, ఏఎస్‌ఆర్‌ సేవాసమితి అధ్యక్షుడు గాదిరాజు సుబ్బరాజు, కార్యదర్శి కలిదిండి గోపాలకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని