logo

వీరుడా వందనం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించనున్న 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో భీమవరం తరలించారు. గుడివాడ నుంచి బయలుదేరిన ఈ వాహనానికి జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఏలూరుపాడులో సోమవారం సాయంత్రం స్థానిక నాయకులు, ప్ర

Updated : 28 Jun 2022 07:03 IST


అల్లూరి విగ్రహాన్ని తరలిస్తున్న వాహనానికి స్వాగతం పలికేందుకు జువ్వలపాలెం కూడలికి వచ్చిన నాయకులు, ప్రజలు

ఉండి, న్యూస్‌టుడే: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించనున్న 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో భీమవరం తరలించారు. గుడివాడ నుంచి బయలుదేరిన ఈ వాహనానికి జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఏలూరుపాడులో సోమవారం సాయంత్రం స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. విగ్రహాన్ని చూసేందుకు కాళ్ల మండలం ఏలూరుపాడు, జువ్వలపాలెం, కాళ్లకూరు, దొడ్డనపూడి, కాళ్ల, సీసలి, జక్కరం, కోపల్లె, పెదఅమిరం తదితర ప్రాంతాల్లో ప్రజలు ప్రధాన రహదారి వెంబడి నిరీక్షించారు. యువత జాతీయ పతాకాలు పట్టుకొని ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి సర్రాజు, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల ఆహ్వాన కమిటీ ప్రతినిధులు, నిర్వాహకులు విగ్రహాన్ని తరలిస్తున్న ప్రత్యేక వాహనం వెనుక తరలివెళ్లారు. గ్రామాల్లో పలు చోట్ల బాణసంచా కాల్చి వాహనానికి స్వాగతం పలికారు.

రూ. కోట్ల వ్యయంతో..

దాదాపు 10టన్నుల బరువున్న విగ్రహాన్ని ఆగర్రుకు చెందిన అల్లూరి సీతారామరాజు సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్నారు. రూ.3కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. విగ్రహం ఏర్పాటు చేయనున్న ఏఎస్‌ఆర్‌ పార్కులో గోడలపై అల్లూరి జీవిత విశేషాలను రాయించనున్నారు. జాతీయ జెండా విగ్రహం పైనుంచి ఎగురుతున్నట్లుగా విద్యుద్దీపాలంకరణలు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని