logo

ధాన్యం బకాయిల కోసం రిలే దీక్షలు

ధాన్యం బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ దెందులూరు మండలం కొవ్వలిలో రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

Updated : 28 Jun 2022 12:49 IST

దెందులూరు : ధాన్యం బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ దెందులూరు మండలం కొవ్వలిలో రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. స్థానిక మూడు బొమ్మల కూడలిలో రైతులు బైఠాయించారు. రబీ ధాన్యం విక్రయించి 60రోజులు దాటుతున్నా ఇప్పటికీ చెల్లింపులు జరగలేదని వాపోయారు. ధాన్యం అమ్మిన 21రోజుల్లో నగదు ఖాతాల్లో జమ చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. మరోవైపు ధాన్యం నగదు విడుదల కాకపోవడంతో ఖరీఫ్‌ సాగు మరింత జాప్యం జరుగుతోందన్నారు. పంట కోసం చేసిన అప్పులు తీర్చడానికి అవస్థలు పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే బకాయిలు విడుదల చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని